ప్రకాశం జిల్లా ఒంగోలులోని డీఎంహెచ్వో కార్యాలయంలో శుక్రవారం ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ప్రోగ్రాం అధికారులకు డిఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వర్లు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా వైద్య ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, అందులో డీఎంహెచ్వో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఎక్కడైనా స్క్రబ్ టైఫస్ లక్షణాలు గల రోగులను గుర్తిస్తే వెంటనే చికిత్స అందించాలన్నారు.