అనంతపురం జిల్లా గుత్తి మండలం ఊబిచెర్ల గ్రామం జిల్లా సరిహద్దు పోదొడ్డి వద్ద శనివారం ఆటోను వెనుక నుంచి కారు ఢీ కొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దవడుగూరు మండలం మిడుతూరు గ్రామానికి చెందిన రాజేష్ భార్య కళావతి, నవీన్ భార్య స్వీటీ పుట్టింటికి వెళ్లారు. వారిని పిలుచుకొని తిరిగి మిడుతూరుకు వెళ్తుండగా ఆటోను కారు ఢీ కొంది. ప్రమాదంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజేష్ మృతి చెందగా అనంతపురంకు తరలిస్తుండగా నవీన్ మృతి చెందాడు . పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.