నూతన డి.సి.ఈ.బి కార్యదర్శి గా బాధ్యతలు చేపట్టిన తాటిపర్తి గంగాధరం కు ఘన సన్మానం
జిల్లా స్థాయి డిస్ట్రిక్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు (డి.సి.ఈ.బి) కార్యదర్శిగా ఇటీవల నియమితులైన తాటిపర్తి గంగాధరం కు పీలేరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఘనంగా సన్మానం చేశారు. శనివారం సాయంత్రం పీలేరు ఎం.ఆర్.సి కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి మరియు ఉప విద్యాశాఖ అధికారి లోకేశ్వర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంఈఓ లోకేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ“జిల్లా స్థాయిలో మన పీలేరు మండలానికి డి.సి.ఈ.బి కార్యదర్శి పదవి రావడం గర్వకారణమని అన్నారు. తాటిపర్తి గంగాధరం అనుభవజ్ఞుడైన, క్రమశిక్షణ కలిగిన విద్యావేత్త అని అన్నారు