బ్రాహ్మణపల్లిలో రైలు కింద పడి యువకుడి మృతి
శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలం బ్రాహ్మణపల్లి రైల్వే గేట్ సమీపాన రైలు పట్టాలపై మృతదేహాన్ని గ్రామస్థులు బుధవారం ఉదయం గుర్తించారు. మృతుడి వయస్సు సుమారు 25 ఏళ్లు ఉంటాయని తెలిపారు. విషయం తెలుసుకున్న హిందూపురం రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. అయితే ఆ యువకుడిది ప్రమాదమా?, ఆత్మహత్యా? అనేది తెలియాల్సి ఉంది.