హిమాయత్ నగర్: హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు
హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆదివారం రాత్రి భారీ కురిసింది. జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ పంజాగుట్ట ఖైరతాబాద్ బేగంపేట అమీర్పేట యూసఫ్ గూడా ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తుంది. రోడ్లపై భారీ వర్షం నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. భారీ వర్షం కురవడంతో రంగంలోకి దిగిన జిహెచ్ఎంసి హైడ్రా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షం కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.