గుంతకల్లు: నిరక్షరాస్యులు అందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి: అడల్ట్ ఎడ్యుకేషన్ జిల్లా సూపర్వైజర్ శ్రీధర్
గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు అందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఉల్లాస్ కార్యక్రమాన్ని చేపట్టిందని అడల్ట్ ఎడ్యుకేషన్ జిల్లా సూపర్వైజర్ శ్రీధర్ అన్నారు. గుత్తిలోని వెలుగు కార్యాలయంలో ఏపీఎం అరుణ ఆధ్వర్యంలో మంగళవారం అక్షరాంధ్ర - విల్లాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వాలంటీర్లుగా ఎంపికైన వారు చదువు రాని వారికి చదువు నేర్పించాలన్నారు. వాలంటీర్లు తమ విధులను బాధ్యతగా నిర్వహించాలన్నారు.