శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు
నంద్యాల జిల్లా శ్రీశైలం మహా చిత్రంలో వెలిసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వాళ్లను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆయన సతీమణి ఇందిరమ్మలు మంగళవారం దర్శించుకున్నారు. మొదట ఆలయానికి విచ్చేసిన వారికి స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వాళ్లకు ప్రత్యేక అభిషేకం కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ఆవరణంలో కార్తీక దీపాన్ని వెలిగించారు. ఆలయ అర్చకులు మంత్రి దంపతులకు వేద ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు