నిర్మల్: రాజీవ్ ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు చెల్లించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన
Nirmal, Nirmal | Sep 15, 2025 రాజీవ్ ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు చెల్లించాలని కోరుతూ నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ హాస్పిటల్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు రాక కుటుంబ పోషణ భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు చెల్లించే ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ఎక్స్టెన్షన్ పిరియడ్ ను పెంచి వెంటనే జీతాలు చెల్లించేలా చూడాలని కోరారు.