గంజాయి మూలాలను కనిపెట్టేందుకు సి.ఐ, ఎస్సైల ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు. ఈ బృందాలు జిల్లాలో గంజాయి వినియోగం...క్రయ విక్రయాలు, అక్రమ రవాణా, నిల్వలు గుర్తించేందుకు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో సుశిక్షణ తీసుకున్న పోలీసు జాగిలాల సహాయంతో టీ కేఫ్ లు, హోటళ్లు మరియు రైల్వే స్టేషను, ఆర్.టి.సి కాంప్లెక్స్, పార్సిల్ సర్వీసు, ట్రాన్స్ పోర్టు కార్యాలయాలు, కార్గో సర్వీసులు, గొడౌన్లు, లాడ్జిలలో ముమ్మర వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.