రుద్రంగి: శ్రీ బుగ్గరాజరాజేశ్వరస్వామి ఆలయంలో చోరి..ఘటన స్థలానికి పోలీసులు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని రుద్రంగి మండలకేంద్రంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దొంగలు చొరబడి హుండీని ధ్వసం చేసి డబ్బలు సామగ్రిని దొంగిలించారు.ఆలయం అటవీ ప్రాంతంలో ఉండడంతో ఆలయానికి వేసిన తాళన్ని పగులకొట్టి దొంగ తనానికి పాల్పడ్డారు. ఆలయ చైర్మన్,పూజారి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి క్లూ టీం చేరుకొని దోంగతనం జరిగిన ప్రదేశాలను సోమవారం ఎస్సై క్షేత్రస్థాయిలో పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.