సర్వేపల్లి: బూడిద తరలించే బల్కర్లను అడ్డుకున్న స్థానికులు, ఉద్రిక్తత..
ముత్తుకూరు మండలం, బ్రహదేవం వద్ద స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.బూడిద తరలించే బల్కర్లు, టిప్పర్ లను అడ్డుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పై ఫ్లైయాష్, వైట్ వాష్ నీరు పడుతున్నాయని.. దానివల్ల రోడ్డులు దెబ్బతింటున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోడ్ల వెంబడి ప్రయాణించాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆదివారం సాయంత్రం స్థానికులు మండిపడ్డారు..