సర్వేపల్లి: చికెన్ మసాలా కి వచ్చి, నరసింహ కండ్రిగలో సరుడు లాకెళ్లారు
పొదలకూరు మండలంలోనే నరసింహ కండ్రిగ గ్రామంలో చోరీ జరిగింది. దుకాణంలో ఉన్న ఓ మహిళ మెడలోని నాలుగు సవర్ల బంగారు గొలుసును ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. మోటార్ బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు చికెన్ మసాలా కావాలని అడిగారు. షాపు ఓనర్ వెంగమ్మ వస్తువులు ఇస్తుండగా.. ఆమె మెడలోని నాలుగు సవర్ల బంగారు సరుడును అపహరించుకు వెళ్లారు. పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.