సత్తుపల్లి: టేకులపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం,ఆగి ఉన్న ట్యాంకర్ ను ఢీకొట్టిన దాన్యం లోడ్ లారీ
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామ శివారు జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం జరిగింది.ఆగి ఉన్న థార్ ట్యాంకర్ ను ధాన్యం లోడ్ లారీ ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో ధాన్యంలోడ్ లారీ క్యాబీన్ నుజ్జు నుజ్జు అయింది.డ్రైవర్ స్వల్ప గాయాల అవ్వటంతో పెనుబల్లి ఆస్పత్రికి తరలించారు.అయితే ధాన్యం బస్తాలు లారీ పై నుండి కిందపడటంతో ట్రాఫిక్ జాం అయింది.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గురైన లారీలని క్రేన్ సహాయంతో పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.