సర్వేపల్లి: నెల్లూరులోనీ డివైడర్ల లో దర్శనమిస్తున్న అరుదైన జాతి మొక్కలు
చిల్డ్రన్స్ పార్క్ రోడ్ , ముత్తుకూరు రోడ్డు డివైడర్లలో అందంగా మార్చే దిశగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వివిధ రకాలైన మొక్కలను అరుదైన జాతులను డివైడర్లలో నాటుతున్నారు. ఇందులో భాగంగా వివిధ ఆకృతులలో తయారైన మాల్ఫిజియన్ జాతి మొక్కలను ఆరు అడుగుల ఎత్తులో కోన్స్ రూపంలో ఉన్న మొక్కలను తెప్పించి డివైడర్లలో ప్రస్తుతం ఉన్న చెట్ల మధ్యలో నాటుతున్నారు. ఇవి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. రోడ్లో వెళ్లేవారు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇవి మొగలుల కాలం ఆకృతులను పోలి ఉన్నాయి.