గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని బాసర గడి సెయింట్ క్లారిటీ పాఠశాలలో కాంగ్రెస్ నేత మారేపల్లి సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు ఎస్ఐలు, శ్రీనివాస్, సురేష్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. పోలీసుల త్యాగాలు, శాంతి భద్రతల పరిరక్షణలో వారి కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోవడానికి పోలీసుల కారణమని, వారి త్యాగాలు మరువలేనివని వారిని సుధాకర్ తెలిపారు.