ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ పిలుపు మేరకు నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఘనవిజయం సాధించినట్టు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. ఈ ప్రాంతం నుంచే 70 వేల మంది ప్రజలు సంతకాలు చేసి తమ వ్యతిరేకతను తెలియజేశారు. సేకరించిన సంతకాల పత్రాలను జిల్లా కేంద్రానికి పంపించినట్లు ఆయన తెలిపారు. ప్రజల ఈ వ్యతిరేకతను ప్రభుత్వం గమనించాలన్నారు.