వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
Wyra, Khammam | Sep 17, 2025 వైరా నియోజకవర్గం ముసలిమడుగు గ్రామంలోని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులతో ముచ్చటించారు.అధ్యాపకులు బోధిస్తున్న పాఠ్యాంశాలు అర్ధమవుతున్నాయా? మీరు బాగా చదువుతున్నారు? మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి? డైట్ చార్ట్ ప్రకారం ఆహారం అందిస్తున్నారా? అని బాలికలను ఉప ముఖ్యమంత్రి ప్రశ్నించారు.ఈ సందర్భంగా బాలికలు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం నిర్ణయించిన డైట్ మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారని చెప్పారు. ప్రతిరోజు గుడ్డు, అదేవిధంగా చార్ట్ ప్రకారం చికెన్, మాంసాహార వంటలను అందిస్తున్నారని చెప్పారు.