మేడ్చల్: అబ్దుల్లాపూర్‌మెట్ లో భారీగా గంజాయిని పట్టుకున్నారు రచకొండ ఎస్ఓటి పోలీసులు
రాచకొండ ఎస్ఓటి పోలీసులు అబ్దుల్లాపూర్‌మెట్ కొత్తగూడ వద్ద భారీగా గంజాయిని పట్టుకున్నారు. సిపి సుధీర్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం మంగళవారం ఒడిశా నుంచి రాజస్థాన్‌కు తరలిస్తున్న 6 కోట్ల రూపాయల విలువైన 1210 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని డీసీఎం వ్యానులు సిమెంట్ బ్యాగుల చాటున రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.