సిరిసిల్ల: పట్టణంలో బీసీ కార్పొరేషన్ ఏర్పాటును స్వాగతిస్తూ CM రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం
పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద బీసీ కార్పొరేషన్ ఏర్పాటును స్వాగతిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పట్టణ కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌లు బీసీల చిరకాల వాంఛను నెరవేర్చారని పేర్కొన్నారు.