పుట్టపర్తిలో 'వాహన మిత్ర ద్వారా రూ. 25 వేలు ఇవ్వాలి: ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి అంజనేయులు
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆటో స్టాండ్ వద్ద ఆటో కార్మికులతో ఏఐటీయూసీ నాయకులు మంగళవారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ.. ఆటో కార్మికులకు వాహన మిత్ర ద్వారా రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి అన్ని ఆటో స్టాండ్లో పార్కింగ్కు స్థలం కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.