తిర్యాణి మండలం గోపేర గ్రామంలో 13 గంజాయి మొక్కలను పట్టుకున్నట్లు ASF జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. తిర్యాణి మండలం గోపేర గ్రామ శివారులో పెందుర్ సొంబాయి పత్తి చేనులో గంజాయి సాగు చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు శుక్రవారం తిర్యాణి పోలీసులు దాడి చేసి 13 గంజాయి మొక్కలను పట్టుకున్నామన్నారు. వాటిని స్వాధీనం చేసుకుని అదే గ్రామానికి చెందిన సొంబాయిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఆమె పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.