అనంతపురం నగర శివారులోని కక్కలపల్లి పంచాయతీలో జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య
Anantapur Urban, Anantapur | Sep 16, 2025
అనంతపురం నగర శివారులోని అనంతపురం రూరల్ మండల పరిధిలో ఉన్న కక్కలపల్లి పంచాయతీ దండోరా కాలనీకి చెందిన గోవిందు అనే వ్యక్తి జీవితం పై విరక్తి చెంది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.