పెద్ద కొడప్గల్: కాఠేపల్లి తండా శివారులోని పంటలను తొలగించిన ఫారెస్ట్ అధికారులు
కాఠేపల్లి తండా శివారులోని పంటలను తొలగించిన ఫారెస్ట్ అధికారులు.... ఫారెస్ట్ భూములను ఆక్రమించుకొని సాగు చేస్తున్న రైతులపై ఫారెస్ట్ అధికారులు కొరడా జూలిపించారు. గురువారం సాయంత్రం 6:40 స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి శివారులో అక్రమంగా ఫారెస్ట్ భూములను ఆక్రమించి సాగు చేస్తుండడంతో ఫారెస్ట్ అధికారులు పోలీసుల బందోబస్తు తో ఆక్రమణలను తొలగించారు. JCB, ట్రాక్టర్ ల సహాయంతో సాగు చేసిన పత్తి పంటలను నేలా మట్టం చేసి తొలగించారు. ఎవరైనా ఫారెస్ట్ భూములను ఆక్రమిస్తే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..