గన్నవరం నియోజకవర్గంలో దెబ్బతిన్న రహదారుల పునర్నిర్మాణానికి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు గన్నవరం ఎమ్మెల్యే కార్యాలయంలో యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. సాస్కి నిధులు రూ.6.76 కోట్లు, ఎన్ఆర్ఆజీఎస్ రూ.3 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. పూర్తిగా పాడైన రహదారులను ముందుగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. విలేజ్ క్లినిక్లకు భూముల కేటాయింపు బాధ్యత తానే తీసుకుంటానని భరోసా యార్లగడ్డ ఇచ్చారు.