బాధ్యతలు చేపట్టిన శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్
శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సతీశ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఆదివారం ఉదయం మొదటగా ఆయనకు పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యాలయంలోని వినాయక దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి ఛాంబర్‌కు చేరుకొని ఎస్పీ రత్న చేతులు మీదుగా నూతన ఎస్పీ సతీశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.