దర్శి: వైసీపీని వీడి టిడిపిలో చేరిన తాళ్లూరు మాజీ ఎంపీపీ, ప్రస్తుత వైస్ ఎంపీపీ, పార్టీలోకి ఆహ్వానించిన ఇన్ ఛార్జ్ లక్ష్మి
ప్రకాశం జిల్లా తాళ్లూరుకు చెందిన మాజీ ఎంపీపీ రమాదేవితో పాటు ప్రస్తుత వైస్ ఎంపీపీ వెంకటేశ్వర్ రెడ్డి వైసీపీని వీడి టిడిపిలో చేరారు. ఆదివారం దర్శి టీడీపీ ఇన్ ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మీ సమక్షంలో వారు టిడిపిలో చేరారు. పది సంవత్సరాలుగా వైసీపీ సానుభూతిపరులుగా ఉన్న వీరు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టిడిపిలో చేరినట్లుగా గొట్టిపాటి లక్ష్మీ అన్నారు.