రాయచోటి: రాజీనామాను ఉపసంహరించుకున్న MLC జకియా ఖానం
రాయచోటికి చెందిన MLC జకియా ఖానం ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మండలి ఛైర్మన్ మోషేన్ రాజు సోమవారం ఆమెను విచారణకు పిలిపించారు. ఇంకా ఆరు నెలల్లో ఆమె పదవీ కాలం పూర్తవుతున్నందున ఇప్పుడు రాజీనామా చేసినా ప్రయోజనం ఉండదని ఛైర్మన్ సూచించినట్లు తెలుస్తోంది. దీనితో జకియా ఖానం తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. YCP నుంచి MLCగా ఎన్నికైన ఆమె అనంతరం ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం అందరికి తెలిసిందే.