పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సులు దొరక్క ప్రయాణికుల అవస్థలు, కిక్కిరిసిపోయిన బస్టాండ్
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. రాకపోకలు సాగించడానికి సోమవారం సాయంత్రం బస్టాండ్‌కు చేరుకున్న ప్రయాణికులకు బస్సులు దొరకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సుల కోసం ప్రయాణికులు గుంపులు గుంపులుగా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మహిళలకు ప్రభుత్వం ఫ్రీ బస్సు ఏర్పాటు చేయడంతో ఏ బస్సులో చూసినా ప్రయాణికులు తో కిక్కిరిసిపోయింది. దీంతో కదిరి నుంచి ప్రధాన పట్టణాలకు వెళ్లేందుకు బస్సులు ఖాళీ లేకుండా పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.