గంగాధర నెల్లూరు: గంగాధరనెల్లూరు మండలంలో నీవానది వరద ఉధృతికి కొట్టుకుపోయిన రహదారి
గంగాధరనెల్లూరు మండలంలో నీవానది శుక్రవారం ఉధృతంగా ప్రవహించడంతో ఎన్ఆర్ పేటకు వెళ్లే రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. దీనివల్ల 10 గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక ప్రజలు ప్రభుత్వం వెంటనే స్పందించి వంతెన ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.