లక్కవరం లో ఇద్దరు వృద్ధులను తాళ్లతో కట్టేసి భారీ చోరీకి పాల్పడ్డ దొంగలు
Eluru Urban, Eluru | Sep 23, 2025
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. లక్కవరం లో నివాసం ఉంటున్న వందనపు రుక్కయ్య లక్ష్మీ కుమారి నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున దొంగలు చొరబడి వారిని తాళ్లతో కట్టేసి కొంత నగదు బంగారు ఆభరణాలు దోచికెళ్లారు. బాధితులు లక్కవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు మంగళవారం ఉదయం 8 గంటలకు డీఎస్పీ రవిచంద్ర పోలీస్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు..