నారాయణ్‌ఖేడ్: ఎనక్ పల్లి గ్రామానికి చెందిన 21 ఏళ్ల అనిల్ రెడ్డి మృతదేహం మంజీర నదిలో లభ్యం, వెలికి తీసిన పోలీసులు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్గిద్ద మండలం ఎనక్‌పల్లి గ్రామానికి చెందిన అనిల్ రెడ్డి (21) మృతదేహం మంజీరా నదిలో లభ్యమైంది. పోలీసులు గాలింపు చర్య లు చేపట్టగా, గజ ఈతగాళ్ల సహాయంతో రాయికోడ్ మండలం శిరూర్ బ్రిడ్జి వద్ద శనివారం ఉదయం 11 గంటలకు మృతదేహాన్ని వెలికి తీశారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. రాయికోడ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.