మేడ్చల్: ఉప్పల్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్
ఉప్పల్ నుంచి బోడుప్పల్ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ అయ్యింది. వర్షాల వల్ల నల్లచెరువు కట్ట ప్రాంతంలో వరద నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులో నీటిని క్లియర్ చేస్తూ, ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు.