కోరుకొండలో పందుల బెడద తీవ్రంగా మారింది. నివాస ప్రాంతాలు, మురుగు కాలవల్లో గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇవి మహిళలు, వృద్ధులు, పిల్లలపై దాడులు చేస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. పందుల వల్ల పారిశుద్ధ్య సమస్యలు కూడా తలత్తుతున్నాయి అన్నారు. పంచాయతీ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.