పెడన: గూడూరు మండలం కంకటావ గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేసిన మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్
గూడూరు మండలం కంకటావ గ్రామంలో గురువారం ఉదయం 9గంటల సమయంలో జరిగిన పెన్షన్ల పంపిణీలో మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ పాల్గొన్నారు. పలువురు పెన్షన్ దారుల ఇళ్లకు వెళ్లిన ఆయన పెంచిన పెన్షన్ సొమ్మును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.3వేలు ఉన్న పెన్షన్ ను రూ.4వేలు పెంచి ఇవ్వడం జరుగుతోందన్నారు.