మంత్రాలయం: కంబళదిన్నెలో ఎస్సీ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించాలని కాలనీవాసులు వినతి
పెద్ద కడబూరు : మండలం కంబళదిన్నెలో ఎస్సీ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించాలని కాలనీవాసులు శనివారం స్తానిక ఎమ్మార్సీలో ఎంఈవో - 1 ఉస్మాన్ బాషాకు వినతిపత్రం అందజేశారు. పాఠశాలలో మొత్తం 96 మంది విద్యార్థులు 1 నుంచి 5 తరగతులు చదువుతున్నారని గుర్తు చేశారు. అయితే హెచ్ఎం ఒక్కరే ఉన్నారని, దీంతో పిల్లల చదువు కుటుపడుతుందన్నారు. ఇక్కడికి డిప్యుటేషన్ ద్వారా టీచర్లను కేటాయించాలన్నారు.