అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఎరువులు సక్రమంగా రైతులకు అందడం లేదు: మెంటాడ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యుల ధ్వజం
Vizianagaram Urban, Vizianagaram | Sep 16, 2025
మెంటాడ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం మధ్యాహ్నం ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సాలూరు ఏఎంసీ చైర్మన్ సూర్యనారాయణ హాజరయ్యారు. సమావేశంలో శాఖల వారీగా ప్రగతి పై సమీక్ష జరిగింది. పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు లేచి అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల రైతులకు సక్రమంగా ఎరువులు అందడం లేదని ధ్వజమెత్తారు. సమావేశంలో వైస్ ఎంపీపీలు సారిక ఈశ్వరరావు పి దుర్గా ఎంపీడీవో భానుమూర్తి, సర్పంచులు,ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.