అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే బయో ఎరువుల వ్యాపారం చేస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే బొల్లా
వినుకొండ ఎమ్మెల్యే, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని రూ.100 కోట్ల బయో అమ్మకాలు చేసుకుంటున్నాడని, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. గురువారం వినుకొండ వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బొల్లా మాట్లాడుతూ.. రైతుల కడుపు నింపలేని ఎమ్మెల్యే తన కడుపు నింపు కుంటున్నాడని, వ్యాపారుల చేత బలవంతంగా తన బయో ఎరువులను రైతులకు అమ్మిస్తున్నాడని విమర్శించారు.