తెనాలి: డ్రోన్ కెమెరా నిఘా ద్వారా పేకాట శిబిరంపై దాడి నిర్వహించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
Tenali, Guntur | Sep 19, 2025 జూదం, పేకాట, కోతముక్క వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లాలోని పెదకాకాని, దుగ్గిరాల, తెనాలి పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక దాడులు నిర్వహించారు. జూదం ఆడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. జూదం ఆడుతున్న వ్యక్తుల వద్ద నుండి రూ.1,37,000/- నగదు, ఆడిన ప్లేయింగ్ కార్డులు, ఒక కారు, నాలుగు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. తినాలి రూరల్ పరిధిలో డ్రోన్ తో గస్తీ నిర్వహించి జూద శిబిరంపై దాడి చేసి 12 మందిని అరెస్టు చేయడం జరిగిందన్నారు.