నగరి: చేనేతలకు అండగా కూటమి ప్రభుత్వం : నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్
సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం చేనేతల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ వారికి అండగా ఉంటుందని శనివారం నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల చేనేత కార్మికుల పనులు ఆగిపోయి ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి, ప్రభుత్వం పుత్తూరు మండలం, గొల్లపల్లిలో మొదటి విడతగా 75 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 50 కేజీల బియ్యం, కందిపప్పు, చక్కెర, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పామాయిల్ ఒక్కొక్క కేజీ చొప్పున ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు.