అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ లోమాలి మహా సంఘం ఆధ్వర్యంలో సత్యశోధక్ సమాజ స్థాపన దినోత్సవం
మహాత్మ జ్యోతిరావు ఫూలే దంపతులు 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక్ సమాజాన్ని స్థాపించి మూఢనమ్మకాలు, స్త్రీ సాధికారత, అక్షరాస్యత కోసం కృషి చేశారని మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్లో సత్యశోధక్ సమాజ స్థాపన దినోత్సవం నిర్వహించారు. పూలే దంపతుల విగ్రహానికి పూలమాలలు వేశారు. సమసమాజ నిర్మాణానికి కృషి చేసిన ఫూలే దంపతులకు భారతరత్న ప్రకటించాలని ప్రభుత్వాలను కోరారు.