నంద్యాల జిల్లా బనగానపల్లెలో రూ.2 కోట్ల ప్రభుత్వ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఆస్థానం రోడ్, ఖాజీవాడ తదితర ప్రాంతాల్లో పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే, తన సొంత నిధులు రూ. 10 లక్షలతో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఉచిత మినరల్ వాటర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.