విశాఖపట్నం: జూన్ 21న విశాఖలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
జూన్ 21న విశాఖలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖ బీచ్ రోడ్ లో ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు ముఖ్యమంత్రి ప్రత్యేక బస్సులు బీచ్ రోడ్ లోని కాళీమాత ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక వద్ద చేరుకొని అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరేంద్రప్రసాద్ మంత్రులను ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరల్డ్ రికార్డ్ నెలకొల్పే దిశగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొననున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్ల పరంగా అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి