పుట్టపర్తిలో గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది నిరసన
సత్యసాయి జిల్లా గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య వేదిక పిలుపు మేరకు పుట్టపర్తి రూరల్, అర్బన్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పుట్టపర్తి మున్సిపాలిటీ గ్రామ వార్డు సచివాలయాల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ గ్రామ,వార్డు సచివాలయాల ఉద్యోగులు గత 15 రోజులుగా పలు రకాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా ఎటువంటి హామీలు ఇవ్వకుండా ఉన్నందున అక్టోబర్ ఒకటవ తేదీ జరగబోయే పెన్షన్ పంపిణీ కార్యక్రమంపై సచివాలయ ఉద్యోగులు ఒక కఠిన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.