సంగారెడ్డి: జాతీయ సాహస శిబిరానికి తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి ఎంపిక
కేంద్ర యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో ఈ నెల 9 నుంచి 19వ తేదీ వరకు జరిగే జాతీయ శిక్షణ శిబిరానికి తార ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని శ్రీవిద్య ఎంపికైంది. ఈ శిక్షణ కార్యక్రమంలో రాష్ట్రం నుంచి మొత్తం 20 మంది విద్యార్థులు మాత్రమే పాల్గొంటారని కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ గురువారం తెలిపారు.