జూలూరుపాడు: జూలూరుపాడు సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు తోపులాట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం లో యూరియా కోసం రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో రకమైన వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.యూరియా సరఫరా సరిగా లేకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితిలో నెలకొన్నాయి.తాజాగా జూలూరుపాడు సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు బాహాబాహీకి దిగారు. రెండో శనివారం మరియు ఆదివారం రెండు రోజులు సొసైటీ కార్యాలయానికి సెలవు కావడంతో సోమవారం రోజు యూరియా కోసం పలు గ్రామాలకు చెందిన రైతులు ఉదయం నుండే అధిక సంఖ్యలో సొసైటీ కార్యాలయం వద్దకు తరలివచ్చారు. యూరియాను పొందేందుకు క్యూలైన్లో వేచి ఉన్నారు.