జిల్లాలోని యువత స్వామి వివేకానంద ను ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో రాణించాలని జిల్లా లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ మరియు జడ్జ్ రాజశేఖర్ పిలుపునిచ్చారు. నగరంలోని నేషనల్ యూత్ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.