మంథని: ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మంథనిలో పలు దేవాలయాల సందర్శన ప్రత్యేక పూజలు
శుక్రవారం తెలంగాణ ఐటీ శాఖ మాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా మంథని మున్సిపల్ కేంద్రంలోని మహాలక్ష్మి దేవాలయంలో మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సీత రామ సేవాసదన్ లలితాంబిక అమ్మవారిని దర్శించుకుని పూజలు చేయడం జరిగింది, అలాగే షిరిడి సాయిబాబా దేవాలయంలో సాయిబాబాను దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.