అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని గార్లదిన్నె మండలం కల్లూరు రైల్వే స్టేషన్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు అని రైల్వే ఎస్సై వెంకటేష్ తెలిపారు. మృతుడు 32 సంవత్సరాలు కలిగిన పూజారి శివయ్యగా గుర్తించామని తెలిపారు. కల్లూరు రైల్వే స్టేషన్ లోని ప్లాట్ఫాం లో ఉన్న మూడవ బెంచి లో అతను మృతి చెంది ఉండటానికి గుర్తించి స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.