హిమాయత్ నగర్: హైదరాబాద్ విముక్తి దినోత్సవం విజయవంతం చేయండి : బర్కత్‌పురాలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు
బర్కత్‌పురాలోని బిజెపి కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం బిజెపి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ గౌతమరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైదరాబాద్ విముక్తి దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పరేడ్ గ్రౌండ్లో విముక్తి దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొంటారని అన్నారు.