సిపిఎం నాయకులపై దాడి చేసిన సీసీ, బుక్ కీపర్ పై చర్యలు తీసుకోండి: సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఈఎస్ వెంకటేష్
బుక్కపట్నంలో డ్వాక్రా సంఘానికి సంబంధించిన డబ్బులు స్వాహా ఘటనకు సంబంధించి అధికారులు తీరుపై నిరసన తెలియజేసేందుకు వెళ్లిన ప్రజాసంఘాల నాయకులు పై భౌతికదాడులకు పాల్పడిన సీసీ, బుక్ కీపర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈఎస్ వెంకటేష్ డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం పుట్టపర్తిలో ఆయన మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపు సభ్యులకు సంబంధించి పెద్ద మొత్తంలో నగదు స్వాహా ఘటన పై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వెంకటేష్ డిమాండ్ చేశారు.